పెదవేగి మండలం అమ్మపాలెంలో జరిగిన బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
తెలంగాణవీణ, ఏలూరు / పెదవేగి : రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక రంగాలకు తోడ్పాటు, పెట్టుబడులు, ఉద్యోగ – ఉపాధి కల్పన, వంటి ఎన్నో ముఖ్యమైన అంశాలపై కనీస అవగాహన లేని జగన్ ముఖ్యమంత్రి అవ్వటం వల్ల రాష్ట్రంలోని యువత బంగారు భవిష్యత్తు సూన్యంగా మారిపోయిందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం అమ్మపాలెంలో సోమవారం నాడు జరిగిన “బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ” కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ముందుగా గ్రామ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చింతమనేని ప్రభాకర్, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రవేశ పెట్టిన 6 హామీల విశిష్టతను ప్రజలకు వివరించారు. టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20లక్షల ఉద్యోగాలతో యువతకు బంగారు భవిష్యత్తు అందిస్తామని, నిరుద్యోగ యువతకు వారికి ఉపాధి లభించే వరకు రూ.3వేల రూపాయలను నిరుద్యోగ భృతిగా అందిస్తూ వారికి అండగా నిలుస్తామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమికి ప్రజలంతా అండగా నిలిచి భారీ విజయం అందించటానికి సిద్ధంగా ఉన్నారని చింతమనేని తెలిపారు. అనంతరం అమ్మపాలెం CSI క్రీస్తు దేవాలయంలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు
దెందులూరు టీడీపీలోకి వరుస చేరికలు◆ జగన్మోహన్ రెడ్డి వైఫల్య పాలనతో విసుగు చెందిన అమ్మపాలెం గ్రామానికి చెందిన మేడంకి.ప్రవీన్, రేమల్లి.రత్న ప్రసాద్, రేమల్లి. అఖిల్, మారిమూడి.మణి బాబు, మేడంకి అశోక్, పిల్లా భాస్కర్, రేమల్లి కిరణ్, అన్నవరపు సుధాకర్, వీర్ల రోసియ్య, పెరికె బుల్లి రామయ్య, జంగం వినయ్, కట్టూరి దిలీప్, పిట్టా రాజేష్, పిట్టా శ్యామ్, జంగం అశోక్ కుమార్ సహా పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు వైసీపీకి వీడ్కోలు పలికి, చింతమనేని ప్రభాకర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పిన చింతమనేని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, మాగంటి మిల్లు బాబు, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షుడు మోతుకురి నాని, రామసింగవరం సర్పంచ్ అడపా శ్రీనివాస్, TNSF అధ్యక్షుడు పెనుబోయిన మహేష్, SC సెల్ అధ్యక్షులు కొర్రపాటి రఘు, క్లస్టర్ ఇంచార్జ్లు మంచినేని శ్రీనివాస్ , ఐనాల వెంకట నారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు చందు శ్రీనివాస్, పార్టీ నాయకులు మురళి,జ్యోతి సహా పలువురు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..