తెలంగాణ వీణ,వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఔట్సోర్సింగ్ కార్మికురాలు రాజమ్మ నర్సుల పట్ల దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని ఎంజీఎం ఆసుపత్రి ముందు నర్సుల ఆందోళన. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో గత 2 రోజుల నుండి హెడ్ నర్సిల్ల పట్ల అతిగా ప్రవర్తిస్తూ ఔట్సోర్సింగ్ కార్మికురాలు రాజమ్మ హెడ్ నర్సులు పనులు చెప్తే దురుసుగా మాట్లాడుతూ దూషణలలాడుతున్న అర్ ఐ ఓ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అలాగే సూపర్డెంట్ కి వినతిపత్రం సమర్పించాము ఆమె విధుల నుండి సస్పెండ్ చేయాలని గురువారం ఎంజిఎం ముందు హెడ్ నర్సులు జేఏసీ నాయకులు రాజమ్మకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు గత రెండు రోజుల నుండి ఆర్ ఐ ఓ సూపర్డెంట్ ఆమెపై చర్య తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అధికారులపై వ్యతిరేక నినాదాలు చేశారు, వైద్యులు సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని వారి ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కి వస్తే రోగులకు డాక్టర్లకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని కానీ ఔట్సోర్సింగ్ కార్మికురాలు ప్రభుత్వ నర్సులపై దర్శక ప్రవర్తించడం ఔట్సోర్సింగ్ రాజమ్మ పెత్తనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు మేము ప్రభుత్వ ఉద్యోగులను రాజమ్మ అవుట్సోర్సింగ్ కార్మికురాలు ఆమె చేసే పనులు హెడ్ నర్స్ చేస్తే ఎలా ఉంటుంది మా పనులు కార్మికురాలు చేస్తుంది, ఇది హెడ్ నర్సలకు ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం హాస్పటల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి పరిష్యరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విధి నిర్వహణలో ఆలసత్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కానీ రాజమ్మ ప్రవర్తన మార్చుకోకపోవడం మాకు సమాధానం ఎదురుగా చెప్పడం జరుగుతుంది రాజమ్మ హెడ్ నర్సల పై దురుసుగా ప్రవర్తించడం వలన రోగులకు ఇబ్బంది ఏర్పడుతుందని అలాగే వెంటనే హాస్పిటల్ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈకార్యక్రమంలో హెడ్ నర్సులు నర్సులు జేఏసీ నాయకులు వార్డు బాయ్ లు వైద్యు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు