తెలంగాణ వీణ, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల మండలం గోపాలపురం నియోజకవర్గానికి నూతన ఇంచార్జిగా నియమించబడిన రాష్ట్ర హోంశాఖ శాఖ మంత్రి తానేటి వనిత కు ఘన స్వాగతం పలికిన మండల ఎంపిపిబొండాడ మోహిని వెంకన్నబాబు ఆధ్వర్యంలో మండల లోని అన్ని గ్రామల వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పొలసానిపల్లి హైవే వద్ద ఘన స్వాగతం పలికారు. అంతరం
ద్వారకాతిరుమల వరకు భారీ బైక్ కారుల ర్యాలీతో బయలుదేరి గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ్రహానికి, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి విగ్రహాలకు పూలమాలవేసి అనంతరం సభలో పాల్గొని నియోజకవర్గంలో ఇంచార్జ్ తానేటి వనిత పరిచయవేదికు ముఖ్యఅతిథిగా మంత్రి ఎంపీ మిధున రెడ్డి,జగ్గంపూడి రాజా,ఎమ్మెల్సీ కవరు శ్రీనివాస్, వైఎస్ఆర్సిపి పరిశీలకులు గన్నమనేని వెంకటేశ్వరరావు (జివి ) గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఈ సభలో పాల్గొన్నారు. కాపు కళ్యాణ మండపం ఎదురుగా వున్న స్థలంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ పరిచయ వేదికకు భారీగా సుమారు 5వేల మంది వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు సభలో నాయకులు మాట్లాడుతూ పుట్టింటికి వచ్చిన వనితమ్మ అని సంబోధిస్తూ అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం వనిత ప్రసంగిస్తూ
జగనన్న ప్రభుత్వంలో జరుగు పథకాలు నవరత్నాలను సభలో హాజరైన వారికి వివరించారు.
సభకు హాజరైన వారికి విందును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని మండలాలు గ్రామాలు నుండి నాయకులు వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.