తెలంగాణ వీణ, ఉప్పల్ : హైదరాబాద్ ఉప్పల్, డిఎస్ఎల్ వర్చువల్ మాల్ లో అన్ లిమిటెడ్ ఫన్ సంస్థ ఆధ్వర్యంలో కిడ్స్ ఫ్యాషన్ షో 2024 అంగరంగ వైభవంగా జరిగింది. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన 50 మంది పిల్లలు ఈ ఫ్యాషన్ షో లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. చిన్న చిన్న పిల్లలు బుడ్డి బుడ్డి డ్రెస్సులు వేసుకొని వాక్ చేస్తూ అలరించారు. ఈ కిడ్స్ ఫ్యాషన్ షో లో ఉత్తమ దుస్తుల ప్రదర్శన లో కేర్ మోడల్ హై స్కూల్ కి చెందిన శిగ నికున్ష్ గౌడ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు నికున్ష్ గౌడ్ ను ఘనంగా సన్మానించి బహుమతి తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అన్ లిమిటెడ్ ఫన్ సంస్థ డైరెక్టర్ సోమేష్ ఆనంద్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుంచే చదువుతో పాటు తమలో ఉన్న నైపుణ్యాలను బయటకుతీసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే భవిష్యత్తు లో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందన్నారు. ఫర్ఫామెన్స్, స్కిల్స్ వారికి భవిష్యత్తులో ఒక భాగం అవుతాయనే ముఖ్య ఉద్దేశ్యంతో ఇలాంటి ఈవెంట్స్ చేస్తున్నామని పేర్కొన్నారు.