తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిమ్మల గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తొలుత బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. తరువాత మద్దెల శివకుమార్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలు మరువలేనని వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిమ్మలగూడెం గ్రామ అభివృద్ధికి సర్పంచ్ బండి రమేష్ ఎంతో కృషి చేశారని ఆయన సేవలు అభినందనీయమన్నారు. సర్పంచ్ గా అందరినీ కలుపుకుపోయి
మంచితనంతో సేవా దృక్పథంతో నిమ్మలగూడెం గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన బండి రమేష్ ఐదు సంవత్సరాలు తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల తరఫున పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. గ్రామాభివృద్ధిలో కూడా భాగస్వామ్యం వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సహా ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్ ను పంచాయతీ తరపున సర్పంచ్ బండి రమేష్ పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా పోటీలు నిర్వహించి విజేతలు గా గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ఆచార్య డాక్టర్ మద్దెల స్వయంగా తన సౌజన్యంతో అతిథుల చేతులమీదుగా అందజేశారు. చివరగా అందరికీ స్వీట్లు మిఠాయిలు చాక్లెట్లు బిస్కెట్లు పండ్లు పంచిపెట్టారు. ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలలో గ్రామ సర్పంచ్ బండి రమేష్ పంచాయతీ సెక్రెటరీ ఇజహేద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఎంపీటీసీ సభ్యులు మూడు గణేష్ ఉప సర్పంచ్ రాఘవులు ఎస్ఎంసి కమిటీ చైర్మన్ టి.రజిత వైస్ చైర్మన్ బండి రమేష్ సహ ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్ వార్డు సభ్యులు చిట్టెమ్మ వెంకటరమణ అంగన్వాడీ టీచర్ ప్రమీల ఆశా వర్కర్ సరోజ
విద్యుత్ సబ్ ఇంజనీర్ విజయసాయి ఉన్నత విద్యావంతుడు వంశీ గ్రామ పెద్దలు బడుగు నాగేశ్వరరావు బండి వెంకన్న ఆర్ఎంపి డాక్టర్ శ్రీనివాస్ లావణ్య భువనేశ్వరి యూత్ సభ్యులు తుంపూరి నరేష్ స్వామి తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.