తెలంగాణవీణ, బెంగళూరు : ఆంధ్ర సారస్వత పరిషత్ 5,6,7 జనవరి 2024 న రాజమహేంద్రవరం గైట్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న *అంతర్జాతీయ తెలుగు మహా సభల ప్రతినిధులకు “రాపిడో సంస్థ ” యాభై శాతం రాయితీ( ఫిఫ్టీ పెరసెంట్) ను బైక్, టాక్సీ & ఆటో లపై ప్రకటించినట్లు పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు రాపిడో సంస్థ తన సేవలు అందిస్తుందని, 4 జనవరి నుండి 8 జనవరి వరకు తెలుగు మహా సభల ప్రాంగణం నకు రాజమహేంద్రవరం, పట్టణం నుండి సేవలు “AP2024” కూపన్ కోడ్ ను ఉపయోగించి సేవలు పొందవచ్చని రాపిడో రైడ్ సంస్థ స్థాపకుడు శ్రీ గుంటుపల్లి పవన్ తెలిపారు.
అంతర్జాతీయ తెలుగు మహా సభల ప్రతినిధులకు “రాపిడో” యాభై శాతం రాయితీ
