తెలంగాణవీణ, జాతీయం : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడ్ న్యాయ్ యాత్ర’పై అసోంలో కేసు నమోదయింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూటులో మార్పులు చేయడమే ఇందుకు కారణమైంది. ఈ మేరకు యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం జోర్హాట్ పట్టణంలో యాత్ర కొనసాగుతున్న సమయంలో ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి మళ్లించారని, చార్ట్‌లో చూపించన మార్గాన్ని ఎంచుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. రూట్‌ను అకస్మాత్తుగా మార్చడంతో అంతరాయాలు కలిగించిందని, యాత్ర నిర్వాహకులు, సహా నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్‌లను బద్దలు కొట్టేలా అక్కడి సమూహాన్ని ప్రేరేపించారని అన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులపై దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు.