Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా చక్రవర్తి

Must read

తెలంగాణవీణ, అంతర్జాతీయం : తొమ్మిదేళ్ల భారతీయ-అమెరికా విద్యార్థిని ప్రీషా చక్రవర్తి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకుంది. 90 దేశాలకు చెందిన 16 వేలమంది విద్యార్థులును ఓడించి ప్రీషా ఈ ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (జేహెచ్-సీటీవై) ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. కాలిఫోర్నియా ఫ్రిమోంట్‌లోని వార్మ్‌స్ప్రింగ్ ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థిని అయిన ప్రీషా జేహెచ్-సీటీవై నిర్వహించిన సమ్మర్ 2023 గ్రేట్ 3 టెస్టులో ఈ రికార్డు అందుకుంది.  స్కూల్ అసెస్‌మెంట్ టెస్ట్ , అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ , స్కూల్ అండ్ కాలేజీ ఎబిలిటీ టెస్ట్‌లలో ప్రీషా అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.  వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో ప్రీషా అడ్వాన్స్ గ్రేడ్5 ప్రదర్శనల్లో 99వ పర్సంటైల్‌తో సమానంగా గ్రాండ్ ఆనర్స్‌ను సొంతం చేసుకుంది. గణిణం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రసాయన, భౌతికశాస్త్రం, రీడింగ్, రైటింగ్ వంటి వాటిలో 2-12 గ్రేడ్‌లలో ఉన్న అడ్వాన్స్‌డ్ విద్యార్థుల కోసం 250కిపైగా ఉన్న జాన్స్ హాప్‌కిన్స్ సీటీవీ ఆన్‌లైన్, ఆన్ క్యాంపస్ ప్రోగ్రాంలకు ప్రీషా  అర్హత సాధించింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మెన్సా ఫౌండేషన్‌లో జీవితకాల సభ్యురాలు కూడా.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you