తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోగా, మరోవైపు యువత ఆనందాన్ని రెట్టింపు చేసేలా హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు మిరుమిట్లు గొలిపేలా ఈవెంట్లు నిర్వహించాయి. అర్ధరాత్రి దాటేదాక రోడ్లపై తిరుగుతూ, పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందుబాబుల పనిపట్టారు. హైదరాబాద్, సైబరాబా కమిషనరేట్లలో కలిసి 2700కుపైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదుచేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1500లకుపైగా కేసులు నమోదవగా, సైబరాబాద్‌లో 1241 కేసులు ఉన్నాయి.