తెలంగాణ వీణ , వరంగల్ : నడికుడ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి బుధవారం పర్యటించారు ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను అనారోగ్యంతో బాధపడు తున్న వారినిని పరామర్శించారు నడికూడ మండలంలోని ధర్మారం గ్రామంలో నక్క లక్ష్మి, నడికూడ గ్రామంలో గోళ్లేపల్లి రాజమ్మ, రాయపర్తి గ్రామంలో నారగాని శంకరయ్య, నార్లపూర్ గ్రామంలో బోగి రాజమ్మ, ఓరుగంటి భాగ్యలక్ష్మిలు మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మనో ధైర్యం కల్పించారు.కాగా రాయపర్తి గ్రామంలో గుండె సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న బండి శంకరయ్య ను పరమార్శించి మెరుగైన వైద్యం అందేలా తాను సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీ లు వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు