తెలంగాణ వీణ ,వరంగల్ : నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ బిల్డింగ్ కు ఈడబ్ల్యూఐడిసి కింద మంజూరైన 13 లక్షల 50 వేల నిధులతో నిర్మించబడుతున్న సైన్స్ బిల్డింగ్ బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భూమి పూజ చేశారు ఎమ్మెల్యేగా మొదటిసారిగా గ్రామానికి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డిని గ్రామ సర్పంచ్ తో పాటు వార్డ్ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి గ్రామ సర్పంచ్ చాడా తిరుపతిరెడ్డి ఉప సర్పంచ్ అశోక్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు సురుగుల కుమార్, మండల పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ నాగారం సర్పంచ్ కట్కూరి స్రవంతి దేవేందర్ రెడ్డి రాయపర్తి ఎంపీటీసీ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతరెడ్డి సమ్మిరెడ్డి నారాయణ వాసుదేవ రెడ్డి మరియు వార్డు సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు