తెలంగాణవీణ, ఉప్పల్ : శుక్రవారం మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్య క్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని, ఉప్పల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి పూర్తీ స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. అంతే కాకుండా పేద వాళ్లకు విద్యా, వైద్యం లాంటి ప్రధాన సమస్యలు ఎవున్నా నా వంతు సహకారం తప్పకుండా అందిస్తామని అన్నారు. కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ ఎల్లవేళలా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. డివిజన్ అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే కు డివిజన్ నాయకులకు కార్పొరేటర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు. ఆయా కాలనీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే కి కార్పొరేటర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పనుల వివరాలు 1,తిరుమలనగర్, 2. హెచ్ బీ కాలనీ ఫేజ్-1 గ్రౌండ్ దగ్గర 3. మంగాపురం వేంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర, మొత్తం మూడు సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి పనులు. ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ స్రవంతి, వర్క్ ఇనస్పెక్టర్ చారి, వాటర్ వర్క్స్ వేణుగోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంక్షేమ సంఘ నాయకులు, ఆయా కాలనీల నాయకులు, గుమ్మడి జంపాల్ రెడ్డి, మల్లేష్ గౌడ్, ప్రతాపరెడ్డి, అశోక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.