తెలంగాణ వీణ , క్రీడలు : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్ కోర్టులో అడుగుపెట్టాడంటే ప్రత్యర్థులకు హడలే. పదునైన ఏస్‌లతో ఎంతటి ఆటగాడినైనా మట్టికరిపించే జకో.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ వీరుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ స్టార్ ప్లేయర్ తన సొగసైటన ఆటతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అయితే.. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్ సందర్భంగా జకోకు ఊహించని పరిస్థితి ఎదురైంది.సర్వ్ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ‘నన్ను పెండ్లి చేసుకో జకో’ అనే మాటలు వినిపించాయి. ఆ మాట వినపడగానే చిన్నగా నవ్విన వరల్డ్ నంబర్ 1.. ‘ఇదివరకే నాకు పెండ్లి అయింది. సారీ’ అని జకోవిచ్ బదులిచ్చాడు.