Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మహేష్‌ బాబు ‘బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్’‌..

Must read

తెలంగాణవీణ, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో వ‌చ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’ . సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్‌ సందర్భంగా మహేష్‌ బాబు తన నివాసంలో ‘సక్సెస్‌ పార్టీ’ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్‌ దంపతులతోపాటు, నాగవంశీ, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొని సందడి చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను మహేష్‌ బాబు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌’ అని ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చారు. అదేవిధంగా తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్‌లుగా నటించారు. రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you