తెలంగాణ వీణ,బాచుపల్లి : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న డబల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్స్ దగ్గర లబ్ధిదారులకి ఇంటి తాళాలు ఇస్తున్నారన్న సమాచారంతో జనాలు తండోపతండాలుగా వచ్చి వారి పట్టా కాగితాలు చూపించి అధికారులు ఇచ్చే ఇంటి తాళం కోసం వేచి చూస్తున్నారు.అయితే సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో లబ్ధిదారులు సిబ్బందిపై విరుచుకుపడడంతో అక్కడ తోపులాటలు జరుగుతున్నాయి.టోకెన్ నెంబర్ సిస్టం లేకపోవడంతో లబ్ధిదారులు గొడవలు పడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు సరైన ఏర్పాట్లు చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.