Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని తరిమికొట్టాలి

Must read

తెలంగాణవీణ,ఆంధ్రప్రదేశ్: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూతుల ఎమ్మెల్యేకి పోలవరం అంటే ఏమిటో తెలియదని, పట్టిసీమ అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. టిడ్కో ఇళ్లను చంద్రబాబు కట్టిస్తే… ఆ కాలనీకి రాజశేఖరరెడ్డి పేరు పెట్టిన వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నానిని తరిమి కొట్టాలని అన్నారు. రేపు మల్లాయపాలెంలో ‘రా.. కదలిరా’ బహిరంగసభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను బూరగడ్డ వేదవ్యాస్ తో కలిసి దేవినేని ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ప్రజాస్వామ్యంపై నానికి నమ్మకం లేదని విమర్శించారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you