Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 ముస్లింలను హెచ్చరించిన కర్ణాటక బీజేపీ నేత

Must read

తెలంగాణవీణ , జాతీయం : ఆలయాలను కూల్చి కట్టిన మసీదులను వెంటనే ఖాళీ చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప ముస్లింలకు హెచ్చరికలు జారీ చేశారు. బెళగావిలో నిన్న హిందూ కార్యకర్తల కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మథుర సహా మరో స్థలం తమ పరిశీలనలో ఉందన్నఆయన.. ఈ రోజో, రేపు కోర్టు తీర్పు వస్తుందని, ఆ వెంటనే అక్కడ ఆలయాలు నిర్మిస్తామని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని అన్నారు. ముస్లింలు స్వచ్ఛందంగా ఆ మసీదులను ఖాళీ చేయకుంటే ఏమవుతుందో? ఎంతమంది చనిపోతారో మాకు తెలియదని ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది డిసెంబరులో ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను ధ్వంసం చేసి కట్టిన ఏ ఒక్క మసీదును వదిలిపెట్టబోమని హెచ్చరించి వార్తల్లో నిలిచారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you