తెలంగాణవీణ,దెందులూరు : దెందులూరు మండలం ధర్మారావు పేటలో జరిగిన బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో వైసిపి ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజల సమక్షంలో నిలదీసిన చింతమనేని ప్రభాకర్. మంగళవారం చక్రాయగూడెం,కన్నాపురంలలో జరిగిన బాబు షూరిటీ కార్యక్రమాల అనంతరం ధర్మారావు పేటకు చేరుకున్న చింతమనేని రాకకోసం అర్ధరాత్రి వేళలో సైతం ఎంతో అభిమానంగా ఎదురుచూసిన గ్రామస్థులకు, ముఖ్యంగా అక్కా, చెల్లెమ్మలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన చింతమనేని. చంద్రబాబు ప్రవేశ పెట్టిన 6 పధకాల గొప్పతనాన్ని గ్రామస్థులకు వివరించిన చింతమనేని ప్రభాకర్ 151 సీట్లతో రాష్ట్రాన్ని ఎదో చేస్తాడని జనం అధికారం ఇస్తే జగన్ సర్వ నాశనం చేశారని అన్నారు. 200 రూపాయల ఫించన్ ని చంద్రబాబు ఒకే సారి 2000/- చేస్తే, ఆ 2000 ని 3000 వేలు చేయటానికి మాత్రం జగన్ కి నాలుగున్నరేళ్లు పట్టిందని అన్నారు.అమ్మఒడి ఇంట్లో ఒకబిడ్డకే ఇస్తాము అని ఎన్నికల నాడు చెప్పకుండా ప్రజలను జగన్ మోసం చేసి గద్దె నెక్కారని అన్నారు. గడచిన నాలుగున్నరేళ్ల వైసిపి హయాంలో రాష్ట్రం దిగజారి పోయిందని, కనీసం రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిలో ఉందని అన్నారు. అవలక్షణాలు కలిగిన వ్యక్తి ఇంటి యజమాని అయితే ఆ ఇల్లు ఎలా నాశనం అవుతుందో జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అలా నాశనం అయ్యింది. పేదవాడి ఇంటి నిర్మాణాలకు అయిన బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో దెందులూరు నాయకులు ఉన్నారు రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యం అని చింతమనేని అన్నారు.