తెలంగాణవీణ, హైదరాబాద్ : అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని… దీనిని రాజకీయం చేయడం సరికాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ… రామమందిర పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం విడ్డూరమన్నారు. ఈ వేడుకలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్ తన విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రామ మందిర నిర్మాణానికి వారు అనుకూలమా? కాదా? చెప్పాలన్నారు.