తెలంగాణ వీణ,భద్రాద్రి కొత్తగూడెం : ప్రపంచంలో మాట్లాడే రెండవ అతి పెద్ద భాష హిందీ అని అలాంటి హిందీ భాష భారతీయులందరూ నేర్చుకోవాలి అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ భాష దినోత్సవం సందర్భంగా స్థానిక సుభాష్ చంద్రబోస్ నగర్ రామవరంలోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భాష వివిధ దేశాల ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంచుతుందన్నారు. అలాంటి ప్రపంచ భాషలలో హిందీ భాష కూడా ఒకటని పేర్కొన్నారు. హిందీ భాషను నేర్చుకోవడం చాలా మంచిదని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలు హిందీ భాష గొప్పతనాన్ని గురించి తెలుపుతూ ప్రసంగాలు కవితలు వినిపించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, హిందీ ఉపాధ్యాయురాళ్ళు నసీమా, జేఫీషా విద్యార్థులు పాల్గొన్నారు.