కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు…జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు.
హైకోర్టు ఉత్తర్వులు కచ్ఛితంగా అందరూ పాటించాలి…
కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
తెలంగాణ వీణ, ఏలూరు: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు 2016 లో జారీ చేసిన ఉత్తర్వులు మేరకు కోడి పందాలు, బెట్టింగులు నిర్వహించుట, ప్రోత్సహించుట, పాల్గొనుట చట్టవిరుద్ధమని కలెక్టర్ పేర్కొన్నారు. సదరు ఉత్తర్వులను అతిక్రమించినచో సంబంధిత చట్టముల ప్రకారం శిక్షార్హులని హెచ్చరించారు. ఏలూరు జిల్లాలో ఎవరైనా పై ఉత్తర్వులను అతిక్రమించిన ఎడల సదరు సమాచారాన్ని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెం. 08812-224519, సదరు విషయంపై తీసిన ఫొటోలు, వీడియోలను వాట్సాప్ నెం. 9491041428 కు పంపవలసిందిగా కోరారు. అదే విధంగా ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎస్పీ కార్యాలయం-9550351100, ఏలూరు ఆర్డిఓ కార్యాలయం – 08812-232044 , నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం , 08656-232717, జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కార్యాలయం, 8500668001 నెంబర్లకు సమాచారం అందించవచ్చన్నారు.