Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి ఆర్థికాభివృద్ధికి కృషి

Must read

  • రైతుల సంక్షేమానికి నిరంతర ఫోకస్
  • కేంద్ర కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అబివృద్ధి సహకార శాఖల మంత్రి బిఎల్ వర్మ

తెలంగాణ వీణ/భద్రాద్రి కొత్తగూడెం :
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా అన్ని గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అబివృద్ధి, సహకార శాఖల మంత్రి
బిఎల్ వర్మ తెలిపారు. మంగళవారం
లక్ష్మిదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 50 కోట్ల పైగా జీరో అకౌంట్ తో జనధన్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించి 32.29 లక్షల కోట్ల పైగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో 13.5 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి విముక్తి పొందారని చెప్పారు. రైతు సంక్షేమానికి భరోసా, రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ వ్యయాలు తగ్గింపు, రైతులకు విత్తనాలు నుంచి మార్కెట్ వరకు ఆధునిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2019లో ప్రారంభమైన పిఎం కిసాన్ పథకం కింద రైతులకు మూడు సమాన వాయిదాలలో ఏడాదిక 6 వేల రూపాయలు సహాయం అందిస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయిలో ప్రత్యక్ష నగదు. మద్దతును ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 11.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం సమకూరిందని చెప్పారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద గత 7 సంవత్సరాల కాలంలో 49.5 కోట్ల మంది రైతులు ఈ పథకంలో సభ్యులుగా నమోదయ్యారని, 14.9 కోట్ల మంది రైతులకు 1.45 లక్షల కోట్లు క్లెయిమ్స్ అందాయని చెప్పారు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ ఒక ప్రత్యేక డ్రైవ్ కింద కిసాన్ క్రెడిట్ కార్డు కవరేజ్ పొందుతున్నారని చెప్పారు. 7.34 కోట్ల కెసిసి దరఖాస్తులకు ఆమోదం తెలపడం ద్వారా 8.85 లక్షల కోట్లు మార్చి 31, 2023 మంజూరు చేశామని చెప్పారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద డ్రిప్, తుంపర నీటిపారుదల వ్యవస్థల ద్వారా వ్యవసాయ క్షేత్రస్థాయిలో నీటి వినియోగాన్ని పెంచడం దీని లక్ష్యమని చెప్పారు. కట్టెల పొయ్యిపై వంట చేయడం మహిళలు ఊపిరితిత్తుల వ్యాదిన పడుతున్నారని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన 2023-24 గత సంవత్సరం వరకు 31.54 కోట్లు కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రతి రోజు 7 వాహనాలు గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయు కార్యక్రమాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి నమోదు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 481 గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 290 గ్రామ పంచాయతీల్లో పూర్తి అయినట్లు చెప్పారు. ఈ నెల 25వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైన లబ్ది దారులకు 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించినట్లు చెప్పారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించినట్లు చెప్పారు. కరోనా వ్యాధి నిర్మూలనలో బాగంగా ఉచితంగా వాక్సిన్ అందించినట్లు చెప్పారు. అనంతరం ఉజ్వల గాస్ కనెక్షన్ లు మంజూరు చేశారు. డ్రోన్ ద్వారా పంటలకు మందు స్ప్రే యింగ్ ప్రారంభించారు. భారతదేశాన్ని 2047 సంవత్సరాతం వరకు అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేయాలని, వలసవాద జాడలు లేకుండా చేస్తామని, వారసత్వాన్ని పండులాగ జరుపుకుంటామని ఏకత్వాన్ని బలపరుస్తామని మన దేశాన్ని గౌరవిస్తామని, భారత పౌరులుగా విధులను బాధ్యతతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సమావేశాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు కెవి రంగా కిరణ్,
స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, జిల్లా సహకార అధికారి ఎన్ వెంకటేశ్వర్లు, ఎల్డీఎం రామి రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, వ్యవసాయ అధికారి అభిమన్యుడు వివిధ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి బిపి తనిఖీ చేపించుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you