తెలంగాణ వీణ ,ఉప్పల్ : ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తేదీ 8-1-2024 సోమవారం రోజున ఉదయం 10:30 గంటలకు ఘట్కేసర్ మండల ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతీ-యువకులకు ఉచిత శిక్షణ -హస్టల్ – భోజన వసతి తో పాటు ఉద్యొగం కల్పించబడును. భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ద్వార నిర్వహింపబడే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఉపాధి అధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుండి ధరఖాస్తులు స్వీకరించబడతాయి కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా తెలియజేశారు