Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సింగరేణి కంపెనీ ఆస్తులపై కన్నేస్తే ఉపేక్షించం

Must read

  • ఆస్తులను కాపాడుతాం అభివృద్ధికి బాటలు వేస్తాం
  • కొత్తగా గనులు ప్రారంభానికి కృషి చేస్తాం
  • రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేస్తాం
  • సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం

తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి కంపెనీ ఆస్తులపై కన్నేస్తే ఉపేక్షించమని.. ఆస్తులను కాపాడుతూ కంపెనీ అభివృద్ధికి బాటలు వేస్తామని.. కొత్తగా గనులు ప్రారంభానికి కృషి చేస్తామని.. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని తీస్తామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం అన్నారు. శుక్రవారం సింగరేణి ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు చైర్మన్ బలరాం ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ముందుగా మైదానంలో చైర్మన్ బలరాం గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు పేద దేశంగా వెనుకబడిన దేశంగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. ప్రతి రంగంలోని అభివృద్ధి కనిపిస్తుందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో గల ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా మనం గత 13 దశాబ్దాలుగా విశేషమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ధర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడుతో సహా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మన సింగరేణి సంస్థ బొగ్గును అందిస్తుందని తెలిపారు. తద్వారా లక్షలాది మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఆ విద్యుత్ దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా స్పాంజ్ ఐరన్ సిమెంటు ఎరువులు మందులు సిరమిక్స్ వంటి రెండు వేల పరిశ్రమలకు మన కంపెనీ బొగ్గును సరఫరా చేస్తుందని తెలిపారు. దీంతో ఆ పరిశ్రమలు అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని వివరించారు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వతంత్ర భారత అభివృద్ధికి వెలుగులు పంచుతున్న మన నల్ల సూర్యులకు కార్మిక సోదరులకు అధికారులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఈ నెల రోజుల కాలంలో అనేక గనులను సందర్శించడం జరిగిందని తెలిపారు. సంక్షేమ విషయంలో ముందున్నామని తెలిపారు. అయినప్పటికీ ఇంకా ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కార్మికుల వైద్య సౌకర్యాలు మెరుగుపరచడం కోసం అన్ని ఆసుపత్రులని ఆధునికరించడం జరిగిందని తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునిక యంత్ర పరికరాలను ఐదు చోట్ల ఆక్సిజన్ ప్లాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్షణపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. సింగరేణి క్వార్టర్ల స్థలాలను ఆక్రమించి ఉన్న వారిని వెంటనే తొలగించి తిరిగి వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏడాది పొడుగునా ఉచితంగా అనేక శిక్షణలు ఇవ్వడం కోసం గోదావరిఖని మందమర్రి చెన్నూరులలో ఈ ఏడాది అత్యాధునిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. దీనిని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. తద్వారా నిరుద్యోగులైన వారికి ఉపాధి అవకాశాలు తేలికగా లభిస్తాయని చెప్పారు. సింగరేణి సంస్థ నేడు లాభాల్లో ఉంది కాబట్టి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు. లాభాలు ఎక్కువగా రావాలంటే మనం పనితనాన్ని మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండుసార్లు మన సింగరేణి కంపెనీ బి ఐ ఎఫ్ ఆర్ లోకి పోయిన సరే తిరిగి లాభాల్లోకి తీసుకొని రాగలరని తెలిపారు. ఈ ఏడాదికి మనం నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 700 లక్షల టన్నులు, ఇంకా మిగిలిన కాలంలో సాధించాల్సిన ఉత్పత్తి 160 లక్షల టన్నులు ఉందన్నారు. ఇది సాధ్యం కావాలంటే ఇకపై రోజుకు సింగరేణి మొత్తం మీద కనీసం 2.27 లక్షల టన్నులు ఉత్పత్తి 2.15 లక్షల టన్నుల రవాణా జరగాల్సి ఉందని తెలిపారు. విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడం కోసం నిర్మించిన 224 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు విజయవంతంగా ముందుకు పోతున్నాయని తెలిపారు. సింగరేణి చెల్లించే సుమారు 500 కోట్ల రూపాయల విద్యుత్ సగానికి పైగా ఇప్పుడు ఆదావుతుందని తెలిపారు. రెండవ దశలో మరో 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. సింగరేణి అభివృద్ధి లక్ష్యంగా ఐక్యమత్యంతో ముందుకు పోతున్నామని చైర్మన్ బలరాం స్పష్టం చేశారు. అనంతరం ఉత్తమ అధికారులకు ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు జీఎంలు అధికారులు ఉద్యోగులు కార్మికులు ప్రజలు విద్యార్థులు ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you