తెలంగాణవీణ,సినిమా : వరలక్ష్మి శరత్ కుమార్ ఒక వైపున సినిమాలతో .. మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు ‘హను మాన్’ వచ్చింది. ఈ నెల 12వ తేదీన విడుదలైన ఈ సినిమా, సక్సెస్ టాక్ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ .. “ఏ పాత్ర అయినా నాకు నచ్చితేనే చేస్తాను .. లేదంటే లేదు” అన్నారు. ” ఒకసారి ఒక సినిమా ఒప్పుకున్న తరువాత అంకితభావంతో పనిచేస్తాను. ఆ సమయంలో అది హిట్ అవుతుందా .. లేదా అనేదానిని గురించిన ఆలోచన చేయను. ఎందుకంటే అది నా చేతిలో లేని విషయం. నా చేతిలో లేని దానిని గురించి నేను ఆలోచన చేయను. నేను ఊహించని పాత్రలు పడిపోయి, నేను ఎంతమాత్రం ఆశించని పాత్రలు హైలైట్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి” అని చెప్పారు. “ఇక నేను సెట్ కి వెళ్లడానికి ముందే ఆ రోజు చేయవలసిన సీన్స్ తాలూకు డైలాగ్స్ ను నేర్చుకుని ఉంటాను. ఎందుకంటే సెట్ కి వచ్చిన తరువాత నా కారణంగా ఆలస్యం కావడం నాకు ఇష్టం ఉండదు. టేకులపై టేకులు తీసుకోవడం అసలే నచ్చదు. ప్రామ్ టింగ్ తీసుకోవడమనేది నాకు అలవాటు లేని పని. ముందుగా ప్రిపేరై ఉండటమే మంచిదనేది నా అభిప్రాయం” అన్నారు.