తెలంగాణ వీణ, వరంగల్ : వరంగల్ రామన్నపేట లోని డాక్టర్ ఏ . రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని గుండ్ల సింగారం ప్రాథమిక పాఠశాలలో గల 1,2 అంగన్వాడిసెంటర్లలో code2106036 లోని 20 మంది పిల్లలకు పలకలు, బలపాలు పంపిణీ చేయడమైనది.ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళలు విద్యను అభ్యసించుటకై ఒక్క ప్రథమ ఉపాధ్యాయురాలుగా ఎంతో శ్రమకోర్చి విజయం సాధించారు. సావిత్రి బై పులే జయంతి రోజున వారిని మనం స్మరించుకోవడం మనలను మనం గౌరవించుకున్నట్టుగా భావించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అన్నారు. చదువు సంస్కారాన్ని, సభ్యతను, వినయం, విధేయతలతోపాటు వ్యక్తిత్వ వికాసంతో పెంపొందిస్తుందని. సమాజంలో మన చుట్టూ ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించవచ్చు అన్నారు. పూర్వకాలంలో ఆడపిల్లలను చదువు అంటే చదివించేవారు కారు. కానీ ఇప్పుడు ఒక గృహిణి చదువుకున్నచో ఆ కుటుంబం విద్యావంతులే కాకుండా చుట్టుపక్క వారికి కూడా మార్గదర్శలవుతారు అన్నారు. ప్రధానోపాధ్యాయులు కే. వేణు మాట్లాడుతూ ట్రస్టు వారు ఇలా పంపిణీ చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. అంగన్వాడీ టీచర్ సావిత్రి మాట్లాడుతూ మేము మా పిల్లలను ఎలా చూసుకుంటామో అలాగే ఈ పిల్లలను కూడా చూసుకుంటున్నామని వివరించారు. సీనియర్ సిటిజన్ యుగంధర్ మాట్లాడుతూ ఒక సీనియర్ సిటిజన్ అయి ఉండి ఇలా కార్యక్రమం చేయడం మాకు కూడా గర్వకారణం అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల జ్యోతి, సమ్మక్క, ఆయ శాంత మరియు అంగన్వాడి పిల్లలు పాల్గొన్నారు.