తెలంగాణ వీణ, ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం లోని కాప్రా డివిజన్ పరిధిలోని ‘జనప్రియ సిల్వర్ క్రెస్ట్’ కాలనీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఏస్ యువ నాయకులు బైరి నవీన్ గౌడ్ గురువారం కాలనీ సంఘం నేతలతో కలిసి పర్యటించారు. కాలనీని ఏర్పాటు చేసిన జనప్రియ రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ కనీస మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. అనేక అభివృద్ధి పనులు పెండింగులో ఉన్నాయి. దీనితో కాలనీ వాసులు దశాబ్ద కాలంగా పడుతున్న ఇబ్బందులను పరిశీలించడం జరిగింది. రోడ్లు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల సమస్యలు నెలకొన్నాయి.bకాలనీలో నెలకొన్న సమస్యలను ఎమ్మేల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అందుకు స్పందించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బీఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 1.50 కోట్లతో ‘సిల్వర్ ట్రస్ట్’* కాలనీలో రోడ్లు, విద్యుత్ స్తంభాలు, దీపాలు, ఫుట్ పాత్ లు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారం రోజుల్లో కాలనీలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నా మని బైరి నవీన్ గౌడ్ పేర్కొన్నారు.ఈ కార్య క్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రజిత, కార్యదర్శి విపణి, రాఖీ, కిరణ్ కుమార్, రాంగోపాల్, అంబేష్, స్వర్ణలత, దినేష్ పాల్గొన్నారు.