తెలంగాణవీణ, హైదరాబాద్ : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత పదేండ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్‌లూమ్ నేతన్నలు అభివృద్ధితో పాటు తమ కార్యకలాపాలు విస్తరించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్‌లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, వస్త్ర పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. వస్త్ర పరిశ్రమకు సంబంధించి 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.