తెలంగాణ వీణ, ఉప్పల్ : తెలంగాణ అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి బీ ఆర్ ఎస్ పార్టీ తరపున ఘన విజయం సాధించిన బండారి లక్ష్మారెడ్డి కి శుభోదయ నగర్ కాలనీ ప్రెసిడెంట్ బి.శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ సంధర్బంగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే ని కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు