సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,కార్పొరేటర్ బొంతు శ్రీదేవి
తెలంగాణ వీణ,ఉప్పల్: చర్లపల్లి డివిజన్ లోని కుషాయిగూడ సెయింట్ జోసెఫ్ కాలనీలో 1250 మీటర్ల సిసి రోడ్లను స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ప్రారంభించారు. పెండింగ్ లో ఉన్న అరకొర పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మహేష్ గౌడ్ ,జిహెచ్ఎంసి ఆధికారులు,సిబ్బంది,డివిజన్ నాయకులు,కాలనీల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.