తెలంగాణ వీణ,భద్రాద్రి కొత్తగూడెం :కొత్తగూడెంలో ఈనెల 29 30వ తేదీలలో ఘనంగా తెలంగాణ బాలోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ బాలోత్సవ్ రాష్ట్ర వ్యవస్థాపక కన్వీనర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ శివ కుమార్ తెలిపారు. స్థానిక విద్యానగర్ లో గల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ తెలంగాణ బాలోత్సవంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు కూడా అర్హులేనని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ రెండు రోజుల పోటీలలో
విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వ్యాసరచన వక్తృత్వము చిత్రలేఖనము 4 క్విజ్ 5 శాస్త్రీయ నృత్యాలు తెలంగాణ జానపద నృత్యాలు సినీ నృత్యాలు పాటలు వాయిద్య సంగీతము ఫ్యాన్సీ డ్రెస్సెస్
తదితర అంశాలలో పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు.
ఇందులో ప్రతి విభాగంలో ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు కూడా ఉంటాయని అంతేకాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ 30 వ తేదీ సాయంత్రం జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రదానం చేయబడుతుందని ఈ మహా తెలంగాణ బాలోత్సవ్ ముగింపు వేడుకలకు ప్రముఖ రాజకీయ సినీ ప్రముఖులు అధికారులు కళాకారులు హాజరవుతారని
రంగ రంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఆచార్య డాక్టర్ మద్దెల పిలుపునిచ్చారు. అత్యవసర సమావేశంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తో పాటు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సినీ గాయకులు అపరబాలు అల్లి శంకర్ జాతీయ గాయకులు సినీ గాయకులు స్వరవిద్వాన్ కలవల రాందాస్ సినీ నటులు చిత్రపురి సొసైటీ కార్యదర్శి తాండూర్ ధనరాజ్ సంఘ ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ తదితరులు పాల్గొన్నారు.