తెలంగాణ వీణ, భువనగిరి : ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఆయనకు మొదటగా ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి, ప్రధానలయంలోని స్వయంభు మూర్తుల దర్శనం అనంతరం, ప్రత్యేక ఆశీర్వచనములు చేసిన ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు. స్వామివారి మిత్రులు మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి దర్శించుకున్న ఎంఎల్ఏ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరిజిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. సంక్షేమ అభివృద్ధి సమపాలలో ఉండాలని కాంగ్రెస్ ఈ నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ ఫలాలు అందరికి అందాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.