Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సింగరేణి సీఎండి బలరాంకు శుభాకాంక్షలు

Must read

తెలంగాణ వీణ/భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా నూతనంగా భాద్యతలు చేపట్టిన బలరాంకు కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కూనంనేని సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలో బలరాంకు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన భూగర్భ గనుల ఏర్పాటుపై ప్రత్యేక ద్రుష్టి సారించి కోల్ బెల్ట్ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి సింగరేణి ప్రాంతాలను అభివృద్ధి చేయాలనీ కోరారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీగా అధికార యంత్రంగానికి సంపూర్ణ సహకారాలు అందిస్తామని కార్మికుల సంక్షేమం సమస్యల పరిస్కారం కోసం సమిష్టిగా కృషి చేద్దామని సూచించారు. కార్మికుల సంక్షేమం సొంతింటి నిర్మాణం కొరకు ప్రణాళికలు చేయాలని కొత్తగూడెం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కూనంనేనితోపాటుగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ కొత్తగూడెం బ్రాంచ్ నాయకులు వంగ వెంకట్ రమణమూర్తి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you