తెలంగాణవీణ, మల్కాజిగిరి : క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడతాయనీ గరుఢ బ్యాడ్మింటన్ అకాడమీ మెనేజింగ్ పార్టనర్ లయన్ డాక్టర్ చుక్ల వేణు పేర్కొన్నారు. మల్కాజిగిరి సర్కిల్ నేరేడ్ మెట్ డివిజన్ యాప్రాల్ ఎంప్లాయిస్ కాలనీలోని షటిల్ క్లబ్ 3వ వార్షికోత్స వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడకారులు ఉత్సహాంగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడకారులు ఉత్సహాంగా పాల్గొన్నారు. సింగల్స్, డబుల్స్ విభాగంలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. గౌరవ అతిథిగా రిటైర్డు తహసిల్థార్ రామారావు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలు అవసరమని క్లబ్ చేస్తోన్న సేవలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ చుక్లవేణు, క్లబ్ అద్యక్షులు రమేష్, క్లబ్ సభ్యలు బిల్డర్ ఎస్. రాంబాబు, జి.రవికుమార్ యాదవ్, మాజీ క్లబ్ అధ్యక్షులు ప్రసాద్, జయారావు, గోకుల్, విక్టర్, రమేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, రఘు, రంగన్న, అనీల్, సురేస్, శ్రీరాం, పమేమేష్ తోపాలు కాలనీ మహిళలు పాల్గొన్నారు. సింగల్స్, డబుల్స్ లో నిలిచిన విజేతలను పలువురు ప్రశసించారు.
Tweetఘనంగా కాలనీ షటిల్ క్లబ్ క్రీడపోటీలు.. pic.twitter.com/INESpkR4mC
— GS9TV Telugu News (@Gs9tvNews) January 1, 2024