తెలంగాణవీణ, శామీర్ పేట్ : ఉమ్మడిశామీర్పేట్ మండలలో అయోధ్య శ్రీరామ అక్షింతలు పండుగ వాతావరణం లో గ్రామాల్లో ఇంటింటికి పంచుతున్నారు. శామీర్ పేట్ మండలం అలియాబాద్, ముడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో అయోధ్య నుంచి విచ్చేసినటువంటి అక్షంతలను మరియు లక్ష్మణ సీత సమేత రామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలను విగ్రహాలతో గ్రామంలో గల హనుమాన్ దేవాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో గడపగడపకు అక్షంతలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గోనె హనుమంత రెడ్డి గ్రామ సర్పంచ్ జ్యోతి బలరాం మాజీ సర్పంచ్ నరసింహులు మాజీ ఉప సర్పంచ్ విశ్వేశ తప్పట్లా నరేందర్ గవ్వల వేణు మమ్మలపల్లి మల్లేశా కొంపల్లి సత్యనారాయణ మేడోజి బలరాం అలియాబాద్ లో మాజీ వైస్ ఎంపీపీ హృదయకుమారు,సంజీవ రెడ్డి, గోపాల్, వెంకటేష్, బిక్షపతి, సత్యనారాయణ, సూర్య శేఖర్,సతీష్, సోమి రెడ్డి,గ్రామస్తులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది