తెలంగాణవీణ, జంగారెడ్డిగూడెం : ఈరోజు చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంగారెడ్డిగూడెం కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. ప్రసాద్ బాబు అధ్యక్షతన ఈనాడు మరియు ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ ఈటీవీ భారత్ వారి చే డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సౌజన్యంతో కళాశాలో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. ఎన్. ప్రసాద్ బాబు మాట్లాడుతూ వాటర్ నమోదు కార్యక్రమం విద్యార్థులను ఎంతో చైతన్యవంతులను చేస్తుంది వారికి ఓటు హక్కు పై అవగాహన కలిగిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం ఎమ్మార్వో కె. స్లీవాజోజి మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ పి. భవాని ప్రసాద్ మరియు జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాముడు జంగారెడ్డిగూడెం రెండవ ఎమ్ ఈ ఓ రాముడు మొదలైన వారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఓటింగ్ నమోదు ఎలా చేసుకోవాలో వివరించారు . ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు ఈ ఓటింగ్ పట్ల అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు . ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఎమ్. ఆర్. ఓ కే స్లీవాజోజి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఓటర్లందరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ పి భవాని ప్రసాద్ మాట్లాడుతూ ఓటును నోటుకు అమ్ముకోవద్దు అని ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించారు . ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమంలో కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఎమ్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి అంటే పౌరులు అందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అద్యాపకులు
యు. వెంకటాచార్యులు సి హెచ్.బదరీ నారాయణ బి.అశోక్ డాక్టర్ జి. వి.లాల్ కళాశాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థినీ విద్యార్థులుపాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం
