- జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
తెలంగాణ వీణ , భద్రాద్రి కొత్తగూడెం : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం ప్రగతి మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 26వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రగతి మైదానంలో జరుగనున్న గణతంత్ర వేడుకలకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సకాలంలో హాజరుకావాలని చెప్పారు. వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు వీక్షణకు ఆకర్షణీయంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలల విద్యార్థులతో దేశభక్తికి సంబంధించిన గీతాలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక కార్యక్రమాలు క్రమ పద్ధతిలో జరిగే విధంగా పర్యవేక్షణ చేయాలని విద్యాశాఖాధికారికి సూచించారు. వేడుకలకు విచ్చేయు ఆహుతులకు సీట్స్ ఏర్పాటు చేయాలని, కేటాయించిన సీట్స్ లో కూర్చోడానికి వీలుగా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రోటోకాల్ పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలని పరేడ్ గ్రౌండ్ స్టేజ్ ఏర్పాట్లు త్రాగునీటి సరఫరా పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటులో ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఉండాలని చెప్పారు. వేడుకల కార్యక్రమం మినిట్ టు మినిట్ ఎప్పటి కపుడు ప్రకటించేందుకు వీలుగా వ్యాఖ్యాతలను ఏర్పాటు చేయాలని డిపిఆర్వోను ఆదేశించారు. వివిధ శాఖల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేజిని పూలతో అందంగా ముస్తాబు చేయాలని ఉద్యాన అధికారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు మధుసూదన్ రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు,
ఆర్ అండ్ బి ఈఈ భీంలా, ఇరిగేషన్ ఈఈ అర్జున్, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, ఆర్డీవో శిరీష, మున్సిపల్ కమిషనర్ రఘు తదితరులు పాల్గొన్నారు.