తెలంగాణవీణ,జాతీయం : జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుండడంతో దేశంలోని అన్ని దారులు అయోధ్యకు దారితీస్తున్నాయి. దశాబ్దాల న్యాయపోరాటం అనంతరం రామ జన్మభూమిలో శ్రీరాముడు కొలువుదీరనున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని గత కొన్నిరోజులుగా క్రతువులు జరుగుతుండడంతో, అయోధ్యలో సంపూర్ణ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ప్రత్యేక ఆహ్వానాలు అందుకున్న వివిధ రంగాల ప్రముఖులతో పాటు, రామ భక్తులు కూడా అయోధ్య పయనవుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే… అయోధ్య ఆధ్మాత్మికతకు మాత్రమే కాదు, పసందైన వంటకాలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ లభించే చిరుతిళ్లు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. దాల్ కచోరీ, చాట్, రబ్డీ, దహీ భల్లా వంటి వంటకాల పేరు చెబితే ఎవరైనా లొట్టలు వేయాల్సిందే.