Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మీనా?

Must read

తెలంగాణవీణ, సినిమా : సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లడం సాధారణ విషయమే. ఇప్పటికే ఎందరో నటీనటులు వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారు. తాజాగా ప్రముఖ నటి మీనా గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. ఆమె త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనేదే ఆ వార్త. కేంద్రమంత్రి ఎల్. మురుగన్ ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు మీనాను ఆహ్వానించారు.  ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలో మీనాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారట. తమిళనాడు నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె బీజేపీలో చేరబోతున్నారని… అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యతను ఇచ్చారని చెపుతున్నారు. మీనా కూడా బీజేపీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you