తెలంగాణవీణ , సినిమా : తెలుగు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడమే తక్కువ. ఒకవేళ తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దుగుమ్మలతో పోటీ పడటం కష్టం ఉన్నట్టు ఒకప్పుడు అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు ముద్దుగుమ్మలు ఉత్తరాది ముద్దుగుమ్మలను మించి అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ లు రాకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా ముద్దుగుమ్మ దివికి మంచి గుర్తింపు లభించింది. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడి కెరీర్ టర్న్ అయ్యింది.బిగ్ బాస్ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన దివికి ఆశించిన స్థాయిలో హిట్స్ పడలేదు. కానీ ఇలాంటి ఫోటో షూట్స్ కారణంగా మంచి ఫాలోయింగ్ దక్కింది అనడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి సంక్రాంతి సందర్భంగా ఇలా తెల్లని చీర కట్టులో ఆకట్టుకుంది. తెల్లని చీర కట్టులో నడుము అందం చూపిస్తూ హొయలు పోతున్న దివి ని నెట్టింట చూసి అంతా కూడా వావ్ అంటూ కితాబిస్తున్నారు. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మరోసారి దివి తన అందంతో వైరల్ గా మారింది. ఇంతటి అందగత్తె కి టైర్ 2 హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్ లు రాకపోవడం దారుణం అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.