తెలంగాణవీణ ,బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసి గ్రౌండ్ నందు నాతరి స్వామి, టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన బెల్లంపల్లి ఏసిపి సదయ్య హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఇనాగ్రేషన్ టీంలు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ టీం మరియు మున్సిపల్ ఆఫీస్ టీం లకు ఏసీపి గారు టాస్ వేయగా బార్ అసోసియేషన్ టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీపి గారు రిటైర్డ్ డి.ఎస్.పి గార్లు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యూత్ ను ఉత్సాహపరిచే విధంగా స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం చాలా ఆనందనియమని, నాతరి స్వామి గారు నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, మరియు యూత్ ను ఇలా ప్రోత్సహించడం వల్ల యూత్ అంతా చెడు వ్యసనాలకు బానిసవ్వకుండా ఆటలపై మక్కువ చూపుతారు కాబట్టి నాయకులందరూ యువకులను ప్రోత్సహించేలా నాయకులు అందరూ స్పోర్ట్స్ ప్రోత్సహించాలని తెలియ జేశారు, మరియు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డి.ఎస్.పి రవికుమార్, ఎస్ హెచ్ ఓ లు రమేష్, బన్సీలాల్, ఎస్ ఐ లు, 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్, మరియు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు మల్లారపు చినరాజం, తాండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఈసా, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ వర్ధన్ రాజ్, తాండూర్ మండల మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, నెన్నల్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొమ్ము రాజన్న, ఓబీసీ జిల్లా కో చైర్మన్ బండి లక్ష్మణ్, బెల్లంపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి జాడి మహేష్ గారు, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిప్ప మనోహర్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కనుకుంట్ల రాజేష్, కాంగ్రెస్ నాయకులు దుర్గం గోపాల్, మల్ల గౌడ్, తారాచంద్, నరసయ్య భామండ్లపల్లి స్వామి, సోషల్ మీడియా కో’ఆర్డినేటర్ బాలు యాదవ్, శ్రీనివాస్, మూర్తి, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎనగందుల వెంకటేష్, భామండ్లపళ్లి భరత్, మైదం అనిల్, అడప నవీన్, అభిలాష్, చిలుముల వెంకటస్వామి, విజయ్, తదితరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు