తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : 2026 జనవరి 3,4,5 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో “ఆంధ్రమేవ జయతే ” అన్న స్పూర్తితో 3వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు ఆపురూపమైన ఉత్సవంగా నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజి లు తెలిపారు. 3వ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు వివిధ దేశాల అధ్యక్షులను, రాయబారులను, వివిధ రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్య మంత్రులను, అనేక దేశాల, రాష్ట్రాలలో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులను, వివిధ సాంస్కృతిక సంఘాలను ఆహ్వానించనున్నట్లు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.