తెలంగాణ వీణ, ఉప్పల్: ఉప్పల్ లో స్వామి వివేకానంద యూత్ బూత్కురి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహమునకు పూలమాలలు వేశారు, ఈ సందర్భంగా భూత్పూర్ నవీన్ మాట్లాడుతూ యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అన్నారు, ఆయన బోధనలు యువతకు మార్గదర్శకాలు కావాలన్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి , చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ , సీనియర్ నాయకులు, మేకల హనుమంత్ రెడ్డి , ముశ్యం శ్రీనివాస్, కోలా రవికుమార్ గౌడ్ , గజ్జెల సత్యరాజ్ గౌడ్ అన్య బాలకృష్ణ, భాషపల్లి నిరంజన్ చారీ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగానివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ సభ్యులు నాగుల సురేష్ నేత, రాజు, సాయి, రాకేష్, మధు, శీను, అనిల్ మొదలగువారు పాల్గొన్నారు.