తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నేడు యువగళం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. యువగళం నవశకం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ-జనసేన శ్రేణులు భారీ తరలివచ్చాయి. దాంతో సభా ప్రాంగణం అంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు.