తెలంగాణ వీణ , హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెల్త్ బులెటిన్‌ను యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయనకు నిన్న శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఉదయం, సాయంత్రం ఆయన హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేస్తున్నారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో వాకర్‌తో నడుస్తున్నారు. శనివారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు రెండో రోజు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయనను వైద్య బృందం నిత్యం పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బెడ్ మీద నుంచి లేచి తిరుగుతున్నారని, ఆర్థోపెడిక్, ఫిజియోథెరఫీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ రోజంతా ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపారు