తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు. ప్రజలకు సహేతుకమైన పాలన అందించడం తమ బాధ్యత అని భట్టి చెప్పారు. శ్వేతపత్రం బుక్ విడుదలపై బీఆర్‌ఎస్ తరపున మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం చెప్పారు. అరగంట ముందు బుక్ రిలీజ్ చేసి చర్చించమంటే ఎలా అని ప్రశ్నించారు. బుక్‌లో ఉన్న అంశాలపై అవగాహన కోసం కొంత సమయం కావాలని అడిగారు.