తెలంగాణ వీణ ,భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం పట్టణంలోని గోదావరి బ్రిడ్జి పక్కన జరుగుతున్న రెండవ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదివారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు మంత్రి తుమ్మల ఐటిసి విశ్రాంతిభవనానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఎస్పీ డాక్టర్ వినీత్ పూల బొకేలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్, ఎస్పీలతో మంత్రి సమీక్షించారు.