తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందని… అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామని ఆయన అన్నారు. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందని చెప్పారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా దెబ్బతిన్న పొలాలను ఈరోజు చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ప్రభుత్వ తప్పుల గురించి ప్రశ్నిస్తే తనలాంటి వారిని కూడా జైల్లో పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చేయని తప్పుకు తనను జైల్లో పెట్టారని… ఎంతో మానసిక క్షోభను అనుభవించానని చెప్పారు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని అన్నారు.