తెలంగాణ వీణ , సినిమా : అనారోగ్యం నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ మరోమారు ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయన ఆసుపత్రికి వెళ్లింది రెగ్యులర్ చెకప్ కోసమేనని, రెండ్రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకుంటారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 70 సంవత్సరాల విజయ్‌కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన భార్య ప్రేమలత. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.