తెలంగాణ వీణ, సినిమా : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘మెర్రి క్రిస్మస్’. 2022 డిసెంబర్ 25న విడుదల అవ్వాల్సిన ఈ మూవీ అప్పట్లో వాయిదా పడింది. సరేలే 2023లో క్రిస్మస్ పండక్కి అయినా ‘మెర్రి క్రిస్మస్’ సినిమాని విడుదల చేస్తారు అనుకుంటే ఈ క్రిస్మస్ కూడా మిస్ అయ్యింది. ఇలా ఏడాదిగా వాయిదా పడుతున్న మెర్రీ క్రిస్మస్ సినిమా ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 12న వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు మెర్రీ క్రిస్మస్ సినిమా రానుంది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని శ్రీరామ్ రాఘవన్ రూపొందిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో శ్రీరామ్ రాఘవన్ దిట్ట, ఆయన డైరెక్ట్ చేసిన ‘అంధాదున్’ సినిమా నేషనల్ అవార్డ్ అందుకుంది.శ్రీరామ్ రాఘవన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే ఎదో కొత్త కథని చూడబోతున్నాం అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూనే ‘మెర్రి క్రిస్మస్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో సేతుపతి, కత్రినా మధ్య సీన్స్ టెర్రఫిక్ గా ఉన్నాయి. కూల్ గా స్టార్ట్ అయ్యి ఇంటెన్స్ రూట్ తీసుకుంది మెర్రీ క్రిస్మస్ ట్రైలర్. కంప్లీట్ గా డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ స్టైల్ లో కథని ఊహించని విధంగా ట్రైలర్ ని కట్ చేసారు. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్ లో ఉన్నాయి. ఈ సస్పెన్స్ డ్రామాకి విజయ్ సేతుపతి అడిషనల్ ఎస్సెట్ అయ్యేలా ఉన్నాడు. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన మెర్రీ క్రిస్మస్ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుంది అనేది చూడాలి.
TweetPresenting the #MerryChristmasTrailer – Hindi 🎁✨
— VijaySethupathi (@VijaySethuOffl) December 20, 2023
In cinemas on 12th Jan 🎄#MerryChristmasTrailer Out Now#SriramRaghavan @TipsFilmsInd #MatchboxPictures @RameshTaurani #SanjayRoutray #JayaTaurani #KewalGarg #KatrinaKaif #SanjayKapoor #VinayPathak #TinnuAnand #RadhikaApte… pic.twitter.com/nolvrm3sg8